
కొన్ని పాటలు ఎప్పటికీ పాతపడవు,ఎప్పుడు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంటాయి.
అలాంటి పాటల్లో ప్రదీప్.పూర్ణిమ జంటగా నటించిన ''ముద్దమందారం'' సినిమా పాటలు కూడా వున్నాయి. నాకు ఈ సినిమాలో కొన్ని పాటలు చాలా ఇష్టం.
ముద్దమందారం సినిమా వచ్చి ఇప్పటికి 30 సంవత్సరాలైన సందర్భంగా
నాకు ఇష్టమైన ఈ సినిమాలోని పాటలు
నా సంగీత ప్రపంచం సరిగమలు...గలగలలు లో...
అలాంటి పాటల్లో ప్రదీప్.పూర్ణిమ జంటగా నటించిన ''ముద్దమందారం'' సినిమా పాటలు కూడా వున్నాయి. నాకు ఈ సినిమాలో కొన్ని పాటలు చాలా ఇష్టం.
ముద్దమందారం సినిమా వచ్చి ఇప్పటికి 30 సంవత్సరాలైన సందర్భంగా
నాకు ఇష్టమైన ఈ సినిమాలోని పాటలు
నా సంగీత ప్రపంచం సరిగమలు...గలగలలు లో...
మందారం...ముద్దుమందారం
మందారం...ముద్దమందారం
ముద్దుకే ముద్దొచ్చే...మువ్వకే నవ్వొచ్చే ...
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్ధ శృంగారం
ముద్దమందారం ముగ్ధశృంగారం
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్దమందారం ముగ్ధ శృంగారం
ముద్దమందారం ముగ్ధశృంగారం
అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా
అడుగులా అష్టపదులా నడకలా జీవనదులా
పరువాల పరువళ్ళు పిరికిణీ కుచ్చిళ్ళు
విరివాలు జడ కుచ్చుల సందళ్ళు
కన్నె పిల్లా కాదు కలల కాణాచి
కలువ కన్నులా కలల దోబూచి
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధశృంగారం
పలుకులా రాచిలకలా అలకలా ప్రేమ మొలకలా
పలుకులా రాచిలకలా అలకలా ప్రేమ మొలకలా
మలిసంజె వెలుగుల్లో నారింజ రంగుల్లో
కురిసేటి పగడాల వడగళ్ళు
మల్లెపువ్వా కాదు మరుల మారాణి
బంతి పువ్వా పసుపు తాను పారాణి
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధశృంగారం
ముద్దుకే ముద్దొచ్చే మందారం
మువ్వల్లే నవ్వింది సింగారం
ముద్ద మందారం ముగ్ధ శృంగారం
ముద్ద మందారం ముగ్ధశృంగారం
అలివేణీ ఆణిముత్యమా
అలివేణీ ఆణిముత్యమా
నీ కంటా నీటిముత్యమా
ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో
స్వాతి వానా లేత ఎండలో..ఓ...ఓ...
జాలినవ్వూ జాజి దండలూ
అలివేణీ ఆణిముత్యమా
నా పరువాలా ప్రాణముత్యమా
జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో
స్వాతి వానా లేత ఎండలో..ఓ...ఓ...
జాజిమల్లీ పూల గుండెలో
అలివేణీ ఆణిముత్యమా
కుదురైన బొమ్మకీ కులుకు మల్లె రెమ్మకీ
కుదురైన బొమ్మకీ కులుకు మల్లె రెమ్మకీ
నుదుట ముద్దు పెట్టనా...బొట్టుగా. హ...
వొద్దంటే ఒట్టుగా
అందాల అమ్మకీ కుందనాల కొమ్మకీ
అందాల అమ్మకీ కుందనాల కొమ్మకీ
అడుగుమడులొత్తనా...మెత్తగా
అవునంటే తప్పుగా
అలివేణీ ఆణిముత్యమా
నా పరువాలా ప్రాణముత్యమా...
పొగడలేని ప్రేమకీ పొన్నచెట్టు నీడకీ
పొగడలేని ప్రేమకీ పొన్నచెట్టు నీడకీ
పొగడ దండలల్లుకోనా పూజగా
పులకింతల పూజగా...
తొలిజన్మల నోముకీ దొర నవ్వుల సామికీ
తొలిజన్మల నోముకీ దొర నవ్వుల సామికీ
చెలిమై నేనుండిపోనా..చల్లగా...
మరుమల్లెలు చల్లగా...
అలివేణీ ఆణిముత్యమా
నీ కంటా నీటిముత్యమా...
జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో
స్వాతి వానా లేత ఎండలో..ఓ..ఓ..
జాజిమల్లీ పూల గుండెలో
అలివేణీ ఆణిముత్యమా...
అలివేణీ ఆణిముత్యమా...
@@@@@@@@@@@@@@@






0 వ్యాఖ్యలు:
Post a Comment