
కన్నులకు చూపందం... కవితలకు ఊహందం
కన్నులకు చూపందం... కవితలకు ఊహందం
తీగకే పూలందం...వారికే నేనందం
కన్నులకు చూపందం... కవితలకు ఊహందం
తీగకే పూలందం...వారికే నేనందం
కన్నులకు చూపందం... కవితలకు ఊహందం
తీగకే పూలందం... వారికే నేనందం
వానాగిపోయిననూ... ఆకుపై చుక్కందం
అల చెదిరిపోయిననూ... దరినున్న నురుగందం
చిన్నారి తారకలే... రాతిరికి ఓ అందం
చిన్నారి తారకలే... రాతిరికి ఓ అందం
శ్రీవారి చూపులకు... ఎప్పుడు నేనందం
కన్నులకు చూపందం... కవితలకు ఊహందం
తీగకే పూలందం...వారికే నేనందం
కన్నులకు చూపందం... కవితలకు ఊహందం
తీగకే పూలంద...వారికే నేనందం
అందాల వన్నెలకే... అపురూప కురులందం
అనురాగ ముద్దరలే... చెరిగిన బొట్టందం
మగువలో ప్రేమొస్తే ...మనుగడే ఓ అందం
మగువలో ప్రేమొస్తే ...మనుగడే ఓ అందం
నా తోడు నీవుంటే... చీకటే ఓ అందం
కన్నులకు చూపందం...కవితలకు ఊహందం
తీగకే పూలందం... వారికే నేనందం
కన్నులకు చూపందం... కవితలకు ఊహందం
తీగకే పూలందం...వారికే నేనందం
కన్నులకు చూపందం...కవితలకు ఊహందం
తీగకే పూలందం...వారికే నేనందం
కన్నులకు చూపందం...కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం...సిరిమల్లి సిగకందం
కన్నులకు చూపందం...కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం...సిరిమల్లి సిగకందం
కన్నులకు చూపందం...కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం...సిరిమల్లి సిగకందం
కిరణాలు రవికందం...సెలయేరు భువికందం
మగువలకు కురులందం ... మమతలకు మనసందం
పుత్తడికి మెరుపందం...పున్నమికి శశి అందం
పుత్తడికి మెరుపందం...పున్నమికి శశి అందం
నాదాలు సృతికందం...రాగాలు క్రుతికందం
కన్నులకు చూపందం...కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం...సిరిమల్లి సిగకందం
కన్నులకు చూపందం...కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం...సిరిమల్లి సిగకందం
వేకువకు వెలుగందం...రేయంత అతివందం
వేసవికి వెన్నెలందం ...ఆశలకు వలపందం
తలపులే మదికందం...వయసుకే ప్రేమందం
తలపులే మదికందం...వయసుకే ప్రేమందం
పాటకే తెలుగందం...శ్రీమతికి నేనందం...
కన్నులకు చూపందం...కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం...సిరిమల్లి సిగకందం
కన్నులకు చూపందం...కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం...సిరిమల్లి సిగకందం
కన్నులకు చూపందం...కవితలకు ఊహందం
చిరునవ్వు చెలికందం...సిరిమల్లి సిగకందం







0 వ్యాఖ్యలు:
Post a Comment