ధన్యవాదములు వనజవనమాలి గారు.. పాటల గురించి మీరు చాలా చక్కగా వర్ణిస్తారు మీ బ్లాగ్ లో నాకు అలా వర్ణించటం రాకపోయినా నాకు ఇష్టమైన పాటలన్నీ ఇలా బ్లాగ్ లో పెట్టుకుంటున్నాను. నా బ్లాగ్ నచ్చినందుకు థాంక్సండీ ..
చిన్నప్పడు అమ్మ పాడే పాట నుంచి.. ఇప్పటి అమ్మాయి /అబ్బాయి కోసం మనం పాడే పాట వరకూ.. ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం.. కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి.. కొన్ని పులకరింపజేస్తాయి.. కొన్ని నిద్ర పుచ్చుతాయి.. కొన్ని మేలుకొలుపు పాడుతాయి.. మరి కొన్ని స్పందింపజేస్తాయి.. కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి.. కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి.. కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి.. కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి.. రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను. ఇందులో పాటలన్నీ నాకుఇష్టమైనపాటలు.. ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.
ధన్యవాదములు..రాజీ..గారు..మీ..బ్లాగ్ చాలా బాగుంది. పాటలని హృద్యంగా పాడటం రాకపోయినా పాటని ప్రేమించడం, పాటని వింటూ అనుభూతి చెందటం.. సంగీత రసజ్ఞతని తెలుపుతుంది.. మీ.. కృషి బాగుంది.
ReplyDeleteధన్యవాదములు వనజవనమాలి గారు..
ReplyDeleteపాటల గురించి మీరు చాలా చక్కగా వర్ణిస్తారు మీ బ్లాగ్ లో నాకు అలా వర్ణించటం రాకపోయినా నాకు ఇష్టమైన పాటలన్నీ ఇలా బ్లాగ్ లో పెట్టుకుంటున్నాను.
నా బ్లాగ్ నచ్చినందుకు థాంక్సండీ ..