
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్నమాట తట్టుకోమంటే
మళ్లీ మళ్లీ నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ...
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా? న్యాయమా?
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా? మౌనమా?
చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే
అదే నేను రుజువే చేయ నూరేళ్ళు చాలవే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్నమాట తట్టుకోమంటే
మళ్లీ మళ్లీ నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే... ఏమి చేయమందువే...
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా? న్యాయమా?
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా? మౌనమా?
చెలియా నాలో ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే
అదే నేను రుజువే చేయ నూరేళ్ళు చాలవే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్నమాట తట్టుకోమంటే
మళ్లీ మళ్లీ నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ... ఏమి చేయమందువే
హృదయమొక అద్దమనీ నీ రూపు బింబమని
తెలిపేను హృదయం నీకు సొంతమనీ
బింబాన్ని బంధింప తాడేది లేదు సఖీ
అద్దాల ఊయల...బింబమూగే చెలీ...
నువ్వు తేల్చి చెప్పవే పిల్లా ఎద కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతో వెంటాడి ఇక వేటాడొద్దే
లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్నమాట తట్టుకోమంటే
మళ్లీ మళ్లీ నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ... ఏమి చేయమందువే
గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా? న్యాయమా?
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా? మౌనమా?
తెల్లారి పోతున్నా... విడిపోని రాత్రేది
వాసనలు వీచే నీ కురులే సఖీ
లోకాన చీకటైనా ... వెలుగున్న చోటేదీ
సూరీడు మెచ్చే నీ కనులె చెలీ...
విశ్వసుందరీమణులె వచ్చి నీ పాద పూజ చేస్తారే
నా ప్రియ సఖియా ఇక భయమేలా నా మనసెరిగి నాతోడుగ రావే
ఏమి చేయమందువే ... ఏమి చేయమందువే
ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... న్యాయమా న్యాయమా
ఏమి చేయమందువే... ఏమి చేయమందువే... మౌనమా మౌనమా
ఏమి చేయమందువే ...
లేదని చెప్ప నిమిషము చాలు
పలికె గోరింక చూడవే నా వంక
దోబూచులాటేలరా గోపాలా
నా మనసంతా నీవేనురా







0 వ్యాఖ్యలు:
Post a Comment