.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

8, మార్చి 2017, బుధవారం

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు - Women's Day Special Songs



"మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ" అనే మన పూర్వీకులనుండి ఇప్పటిదాకా మహిళల గొప్పదనం గురించి సినిమాల్లో ఎన్నో పాటలు ఉన్నాయి.ప్రతి స్త్రీ జీవితంలో అతి ముఖ్యమైన  పాత్ర పోషించే మగవారు వారి జీవితాన్ని ప్రభావితం చేసిన స్త్రీ తన తల్లి, అక్కచెల్లెళ్ళు,భార్య, ప్రేమికురాలు, స్నేహితురాలు,కూతురు ఇలా ఎవరి గురించైనా గొప్పగా వర్ణిస్తూ,ఊహిస్తూ పాడుకునే పాటలు చాలా ఉన్నాయి.అవి ఎప్పటికీ అలాగే  గుర్తుండిపోతాయి కూడా. అలాంటి మంచి,నాకు నచ్చిన  కొన్ని పాటలు మహిళా దినోత్సవం సందర్భంగా "నా సంగీత ప్రపంచం" లో.




  1.  మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ
  2. లేచింది నిద్రలేచింది మహిళా లోకం
  3. ఔనంటే కాదనిలే కాదంటే  ఔననిలే
  4. తెలుసుకొనవే చెల్లి అలా నడుచుకొనవే చెల్లీ
  5. దరికి రాబోకు రాబోకు రాజా
  6. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి 
  7. ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా
  8. సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
  9. ఇది నా ప్రియనర్తన వేళా తుదిలేనిది జీవన హేలా 
  10. గాలికదుపు లేదు కడలికంతులేదు
  11. రాయినైనా కాకపోతిని రామబాణము సోకగా
  12. పాడలేను పల్లవైన భాష రాని  దానను
  13. కళ్ళలో  ఉన్నదేదో కన్నులకే తెలుసు 
  14. నేనా పాడనా పాటా మీరా అన్నదీ  మాటా
  15. అందమైన లోకమని రంగురంగులుంటాయని 
  16. శివరంజనీ నవరాగిణీ 
  17. దారిచూపిన దేవతా నీ చేయి ఎన్నడు వీడకా 
  18.  ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మవుగా 
  19. ఎదో ఎదో అన్నది ఈ మసక మసక వెలుతురు
  20. అందానికి అందం ఈ పుత్తడిబొమ్మ
  21.   మా జననీ లోకపావనీ 
  22. వనితా లత కవిత మనలేవు లేక జత 
  23. ఆడదే ఆధారం మనకధ  ఆడనే ఆరంభం 
  24. మహిళలు మహారాణులు 
  25. ఆడాళ్ళు మీకు జోహార్లు ఓపిక ఒద్దిక మీ పేర్లు
  26. పల్లవించవా నాగొంతులో పల్లవి కావా నా పాటలో 
  27. మెరిసే తారలదే  రూపం విరిసే పువ్వులదే రూపం 
  28. సొగసు చూడతరమా - రాజేంద్రప్రసాద్ 
  29. సొగసు చూడతరమా - నరేష్
  30. ఇన్ని రాశులయునికి ఇంతి చెలువపు రాశి 
  31. శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వా 
  32. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన 
  33. ఊసులాడే ఒక జాబిలట  
  34. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు 
  35. అందమైన నా ఊహల మేడకు ఆవిడ మణిదీపం 
  36. ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటి వెలుగు అయ్యింది 
  37. దివిని తిరుగు మెరుపు లలన సామజవరాగమనా
  38. ఓ అందమా తెలుగింటి దీపమా వెలుగంటి రూపమా 
  39. సరికొత్త చీర ఊహించిచాను
  40. సమయానికి తగుసేవలు సేయనీ నీ శ్రీవారినీ 
  41. అపురూపమైనదమ్మ ఆడజన్మా 
  42. నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం
  43. లేఖా ఇది ఒక లేఖా
  44. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా 
  45. తల్లివైనా చెల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే 
  46.  మహిళా ఇక నిదురనుంచి మేలుకో
  47. తెలుగమ్మాయి తెలుగమ్మాయి 
  48. శ్రీకారం చుడుతున్నట్లు కమ్మని కలనాహ్వానిస్తూ 
  49. దేవత నీవే నా దేవత నీవే 
  50. కంటేనే అమ్మ అని అంటే ఎలా 
  51.  చిట్టి చిట్టి కవితన్నేనే సీతాకోకచిలకన్నేనే
  52. నమ్మకు కొందరు ఆడాళ్ళలోని ప్రేమలనీ


2 కామెంట్‌లు:

  1. చివరి పాట (No.50) సంధర్భ విరుద్దంగా ఉందండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "Kishore" గారు.. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలండీ
      ఆ పాట మొత్తం ఆడవాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా చివరి చరణంలో వేణు ఆడవాళ్ళని గురించి చాలా గొప్పగా పాడారు చూడండి.అందుకే ఈ పాటని కూడా లిస్ట్ లో ఉంచాను.

      Thank You..

      తొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.