.

♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫ ♪ ♫

7, ఏప్రిల్ 2011, గురువారం

రాజన్-నాగేంద్ర All Time Hit Songs

రాజన్ నాగేంద్ర సోదరులు గొప్ప సంగీత దర్శకులు.వీళ్ళిద్దరి దర్శకత్వంలో చాలా మంచి పాటలు వున్నాయి.. ఇప్పటికీ ,ఎప్పటికీ వినాలనిపించేలా ఆహ్లాదకరమైన పాటలు ఎన్నో వీరి సొంతం.వీటిలో పంతులమ్మ,ఇంటింటి రామాయణం, నాలుగు స్తంభాలాట, మూడుముళ్ళు ఇంకా చాలానే వున్నాయి,"రాజన్-నాగేంద్ర" గారి పాటల్లో నాకు నచ్చే పాటలు నా సంగీతప్రపంచం లో .... 


సొమ్మొకడిది సోకొకడిది - 1979
ఆ పొన్న నీడలో ఈ కన్నె వాడలో
అబ్బో నేరేడు పళ్ళు 
తొలివలపూ తొందరలు 
ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా

నాగమల్లి  - 1980

నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారీ   
రాగంతీసే కోయిలా కోయకు గుండెలు తీయగా 

అల్లరి బావ - 1980

చూపులు కలిసిన శుభవేళ - 1988


2 కామెంట్‌లు:

  1. మీరు చెప్పినట్లు చాలా మంచిపాటలు ఉన్నాయి. నాకు బాగా నచ్చినపాటలు రాజన్ నాగెంద్ర గారివి పూజ చిత్రంలొ పాటలు. ముఖ్యంగా వాణిజయరాం పాడిన "పూజలు చెయ పూలు తెచ్చాను". అగ్గిబరాటా సినిమాలొ "ఏమొ ఏమొ యిది" అబ్బా - రసగూళికలు

    రిప్లయితొలగించండి
  2. దేవిక గారు థాంక్స్ అండీ...
    మీరు చెప్పిన రెండు పాటలు నాకు కూడా ఇష్టమే..
    ఏమో ఏమో ఇది పాటను నా ఆపాతమధురాలు బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను.

    రిప్లయితొలగించండి

Related Posts Plugin for WordPress, Blogger...

స్వాగతం


చిన్నప్పడు అమ్మ మనకోసం పాడే పాటల నుంచి..
ఇప్పటి మన పిల్లల కోసం మనం పాడే పాట వరకూ..
ఎన్నో పాటలు..ప్రతీ పాటకో నేపథ్యం..ప్రతీ పాటకో అనుభవం..
కొన్ని పలకరించి వెళ్ళి పోతాయి..
కొన్ని పులకరింపజేస్తాయి..
కొన్ని నిద్ర పుచ్చుతాయి..
కొన్ని మేలుకొలుపు పాడుతాయి..
మరి కొన్ని స్పందింపజేస్తాయి..
కొన్ని నవ్విస్తాయి..మరి కొన్ని ఏడుపు తెప్పిస్తాయి..
కొన్ని కోపం కూడ తెప్పిస్తాయి..కొన్ని ప్రశాంతతనిస్తాయి..
కొన్ని ఉల్లాసాన్నిస్తాయి..కొన్ని గతాన్ని తవ్వుతాయి..
కొన్ని భవిష్యత్తును కళ్ళ ముందుంచుతాయి..


రచయిత ఎవరైనా గాయనీ గాయకులెవరైనా నాకు మనసుకు నచ్చిన పాటలను నేను ఈ బ్లాగులో భద్రపరచుకోవాలి అనుకున్నాను.

ఇందులో పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు..

ఇంకా మా చెల్లి రమ్య సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన పాటలు,నేను చేసిన పాటలు నా ఈ సంగీత ప్రపంచంలో కనిపించి,వినిపించి అలరిస్తాయి.

♪♥♫ గుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం ♪♥♫
నా బెస్ట్ ఫ్రెండ్ సంగీతం...మనసుకు హాయి కలిగినా,
బాధ
అనిపించినా పాటలు నాకు మంచి తోడు.


♪♥♫ రాజి ♪♥♫

రాగాలపల్లకి

.